Writer Padmabhushan Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Writer Padmabhushan Movie In OTT: ఓటీటీలోకి రైటర్‌ పద్మభూషణ్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడ్నుంచి?

Published Sat, Mar 4 2023 6:09 PM | Last Updated on Sat, Mar 4 2023 6:32 PM

Suhas Starrer Writer Padmabhushan Movie Ott Release Date Details - Sakshi

విలక్షణమైన పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు సుహాస్‌. మజిలీ, ప్రతిరోజూ పండగే వంటి చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్న సుహాన్‌ హీరోగా నటించిన తొలి చిత్రం కలర్‌ ఫోటో. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రంలో సుహాస్‌ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తాజాగా రైటర్‌ పద్మభూషణ్‌ సినిమాలోనూ హీరోగా అలరించాడు.

ష‌ణ్ముఖ ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ఆశీష్ విద్యార్థి, రోహిణి, టీనా శిల్ప‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. చిన్న సినిమాగా విడుదలైన రైటర్‌ పద్మభూషణ్‌ డీసెంట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోనూ అలరించిందుకు రెడీ అయ్యింది.ప్రముఖ ఓటీటీ సంస్థ  ‘జీ5’ రైటర్‌ పద్మభూషణ్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 22న ఉగాది సందర్భంగా ఈ సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తెచ్చేందుకు చూస్తున్నారట. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement