క్రైమ్‌ థ్రిల్లర్‌ | Bhoothaddam Bhaskar Narayana Shiva Song launch | Sakshi
Sakshi News home page

క్రైమ్‌ థ్రిల్లర్‌

Published Mon, Feb 19 2024 12:12 AM | Last Updated on Mon, Feb 19 2024 12:12 AM

Bhoothaddam Bhaskar Narayana Shiva Song launch - Sakshi

∙రాశీ సింగ్, రాజ్‌ కందుకూరి

‘‘కలర్‌ ఫోటో’ చిత్రానికి ముందు ‘మను చరిత్ర’ సినిమాలో శివ స్నేహితుడిగా చేశాను. నిర్మాత రాజ్‌ కందుకూరిగారు నన్ను కూడా తన కుమారుడు శివలానే చూసుకునే వారు. నేను హీరో కాకముందే నన్ను ఓ హీరోలా చూశారాయన. ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’లోని ‘శివ ట్రాప్‌ ట్రాన్స్‌..’ పాట అద్భుతంగా ఉంది. ఈ సినిమాని అందరూ చూడాలి’’ అని హీరో సుహాస్‌ అన్నారు. శివ కందుకూరి, రాశీ సింగ్‌ జంటగా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్‌ నిర్మించిన ఈ మూవీ మార్చి 1న విడుదల అవుతోంది.

శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘శివ ట్రాప్‌ ట్రాన్స్..’ అనే పాటని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ లాంచ్‌ చేశారు. అనంతరం నిర్వహించిన సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌కి సుహాస్‌ ముఖ్య అతిథిగా హాజరై, పాట రిలీజ్‌ చేశారు. చైతన్య ప్రసాద్‌ లిరిక్స్‌ అందించిన ఈ పాటని కాలభైరవ పాడారు. ‘‘మా సినిమాని తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు శివ కందుకూరి. ‘‘యునిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది’’ అన్నారు పురుషోత్తం రాజ్‌. ‘‘మా మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు స్నేహాల్, శశిధర్, కార్తీక్‌. ఈ వేడుకలో దర్శకుడు విజయ్‌ కనకమేడల, హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ, నిర్మాత రాజ్‌ కందుకూరి, సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement