
‘‘హీరోగా చేసేటప్పుడు చాలా భయం ఉంటుంది. ఒత్తిడి అయితే కచ్చితంగా ఉంటుంది. అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అయితే మన సీన్స్ వరకు నటిస్తే చాలు. అటు హీరో, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్‌గా చేయడాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను’’ అని సుహాస్ అన్నారు. ఆయన పుట్టినరోజు నేడు (గురువారం). ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ– ‘‘మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని ఇండస్ట్రీకొచ్చాను.. అయ్యాను. ‘కలర్ ఫొటో’తో హీరో అయ్యాను. ఇప్పుడు చేస్తున్న ఆరు సినిమాల్లో ఐదింటిలో లీడ్ రోల్‌లో, మరో సినిమాలో నార్మల్ క్యారెక్టర్ చేస్తున్నాను.
నేను షార్ట్ ఫిలింస్ చేస్తున్నప్పటి నుంచి నాతో పరిచయం ఉన్న దర్శకులతో ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను. ఇంతకు ముందుకంటే ఇప్పుడు సెటిల్ అయ్యానని, సక్సెస్ అయ్యానని నా తల్లిదండ్రులు, భార్య, స్నేహితులు ఆనందపడుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ దర్శకత్వంలో ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం చేస్తున్నాను. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. హీరోగా చేస్తూ మంచి పాత్రలు వస్తే ఇతర సినిమాల్లోనూ చేస్తాను’’ అన్నారు.
చదవండి: గాయంతోనే షూటింగ్‌లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్
కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ సినిమా
Comments
Please login to add a commentAdd a comment