సుహాస్‌ కొత్త సినిమా.. నువ్వు నేను హీరోయిన్‌ రీఎంట్రీ | Actress Anita Hassanandani Re Entry With Suhas Upcoming Movie, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

స్పీడు మీదున్న సుహాస్‌.. సూపర్‌ హిట్‌ మూవీ హీరోయిన్‌తో సినిమా

Published Sat, Mar 30 2024 8:56 PM | Last Updated on Sun, Mar 31 2024 6:32 PM

Anita Hassanandani Re Entry with Suhas Movie - Sakshi

వైవిధ్య‌మైన చిత్రాల‌తో న‌టుడిగా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక మార్క్‌ క్రియేట్ చేసుకున్న హీరో సుహాస్. ఆయ‌న కథానాయకుడిగా న‌టిస్తున్న మ‌రో వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. తమిళ సూపర్‌ హిట్‌ మూవీ 'జో' ఫేమ్‌ మాళ‌విక మ‌నోజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్ గోదాల ద‌ర్శ‌కుడు. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు శ‌నివారం హైద‌రాబాద్‌లోని ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో ప్రారంభ‌మ‌య్యాయి. వి ఆర్ట్స్అండ్ చిత్ర‌ల‌హ‌రి టాకీస్ ప‌తాకంపై హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తాళ్లపు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హీరో, హీరోయిన్‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నిచ్చారు. ద‌ర్శకుడు వ‌శిష్ట కెమెరా స్విచ్చాన్ చేశారు. మ‌రో ద‌ర్శ‌కుడు కొల‌ను శైలేష్ బౌండెడ్ స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడికి అంద‌జేశారు. టైటిల్ పోస్ట‌ర్‌ను ద‌ర్శ‌కులు విజయ్ క‌న‌క‌మేడ‌ల‌, కిషోర్ తిరుమ‌ల‌, నిర్మాత‌ సుద‌ర్శ‌న్ రెడ్డి ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నువ్వు నేను ఫేం అనితా హస్సానందని మాట్లాడుతూ.. నా సెకండ్ ఇన్నింగ్స్‌కు ఫ‌ర్ఫెక్ట్‌గా కుదిరిన చిత్ర‌మిదన్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించనుంది. ద‌ర్శ‌కుడు రామ్‌ మాట్లాడుతూ ఇదొక బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ, సుహాస్ కొత్త‌గా ద‌ర్శ‌క‌త్వం చేసే వాళ్ల‌కు దొరికిన వ‌రం. ఎంతో కంఫ‌ర్ట‌బుల్ ఆర్టిస్ట్‌ అన్నారు.

చదవండి: పెళ్లైన ఏడాదికే విడాకులు.. ఒకప్పుడు స్టార్‌ హీరోలతో జోడీ.. ఇప్పుడేమో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement