యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాన్ నటించిన తాజా చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది.ఈ సినిమాలో సుహాస్ తో పాటు కేరాఫ్ కంచరపాలెం తో ఆకట్టుకున్న కార్తీక్‌రత్నం, బేబీ తో యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న విరాజ్ అశ్విన్, రుహానిశర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నలుగురి పెర్ఫార్మెన్స్ శ్రీరంగనీతులు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇటీవల ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ చేయగా..అక్కడ కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రెమ్‌లో టాప్ ట్రెండింగ్ చిత్రంగా కొనసాగుతుంది. థియేటర్స్‌కి మించిన స్పందన ఓటీటీల్లో రావడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.
‘శ్రీరంగనీతులు’ స్టోరీ ఇదే
ఈ సినిమా కథంతా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. బస్తీకి చెందిన శివ(సుహాస్) టీవీ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. అతనికి ఫ్లెక్సీల పిచ్చి. బతుకమ్మ సందర్భంగా ఆ ఏరియాలోని గ్రౌండ్‌లో ఎమ్మెల్యేతో కలిసి దిగిన ఫోటోతో ఫ్లెక్సీ కట్టిస్తాడు. అయితే దాన్ని రాత్రికి రాత్రే ఎవరో మాయం చేస్తారు. మరో ప్లెక్సీ కట్టించడానికి డబ్బులు ఉండవు. ఎలాగైన పండక్కి గ్రౌండ్‌లో తన ప్లెక్సీ ఉండాలనుకుంటాడు. దాని కోసం శివ ఏం చేశాడు? చివరకు ఏం జరిగింది?
మరోవైపు వరుణ్(విరాజ్ అశ్విన్), ఐశ్వర్య(రుహానీ శర్మ) ప్రేమించుకుంటారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది ఐశ్వర్య. పెళ్లి చేసుకుందామని వరుణ్ పదే పదే అడగడంతో ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు రెడీ అవుతుంది. ఇంతలోపు ఆమె తండ్రి ఓ పెళ్లి సంబంధం తీసుకొస్తాడు. వారికి అమ్మాయి నచ్చడంతో త్వరలోనే పెళ్లి చేయాలనుకుంటారు. ప్రేమ విషయాన్ని చెప్పలేక, పెద్దలు చూసిన సంబంధం చేసుకోలేక సతమతమవుతారు. దీంతో పాటు ఐశ్వర్యకు మరో సమస్య వస్తుంది. ఆది ఏంటి? చివరకు వరుణ్, విరాజ్‌లు పెళ్లి చేసుకున్నారా లేదా?
ఇంకోవైపు ఉన్నత చదువులు చదివిన కార్తిక్(కార్తీక్ రత్నం) డ్రగ్స్‌కి అలవాటు పడి జులాయిగా తిరుగుతుంటాడు. ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడని తెలిసి అతన్ని పట్టుకోవడం కోసం పోలీసులు తీరుగుతుంటారు. కొడుకును పోలీసులకు చిక్కకుండా కాపాడుకునే క్రమంలో తండ్రి(దేవీ ప్రసాద్) చిక్కుల్లో పడతారు. చివరకు తండ్రిని కూడా పోలీసులు పట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? కార్తిక్ డ్రగ్స్‌కు ఎందుకు బానిసయ్యాడు? చివరకు ఈ ముగ్గురి జీవితాల్లో వచ్చిన మార్పు ఏంటి? అనేదే మిగతా కథ.
Comments
Please login to add a commentAdd a comment