సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Suhas Sriranga Neethulu Movie OTT Streaming In Aha | Sakshi
Sakshi News home page

Sriranga Neethulu OTT: సుహాస్ లేటెస్ట్ మూవీ.. సడన్‌గా ఓటీటీ స్ట్రీమింగ్

Published Wed, May 29 2024 9:47 AM | Last Updated on Wed, May 29 2024 10:50 AM

Suhas Sriranga Neethulu Movie OTT Streaming In Aha

మరో తెలుగు సినిమా చెప్పపెట్టకుండా ఓటీటీలోకి వచ్చేసింది. లెక్క ప్రకారం యూట్యూబ్‪‌లో దీన్ని నేరుగా రిలీజ్ చేస్తారనే న్యూస్ వచ్చింది. ఈ క్రమంలోనే దీనికి ఒకరోజు ముందు ఇప్పుడు సైలెంట్‌గా ఈ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.

కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టినప్పటికీ 'కలర్ ఫోటో'తో హిట్ కొట్టిన సుహాస్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్‌‌లో ప్రామిసింగ్ మూవీస్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'ప్రసన్న వదనం' లాంటి మూవీస్‌తో ఆకట్టుకున్నాడు. ఇతడు కీలక పాత్రలో నటించిన మూవీనే 'శ్రీరంగనీతులు'. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)

సుహాస్, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ కీలక పాత్రలు పోషించిన 'శ్రీరంగనీతులు'.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే మే 30న దీన్ని యూట్యూబ్‌లో ఉచితంగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇంతలోనే ఆహా ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్‌‌లోకి తీసుకొచ్చేసింది.

'శ్రీరంగనీతులు' కథ విషయానికొస్తే.. బస్తీ కుర్రాడు శ్యాంసంగ్ శివ (సుహాస్)ది ఫ్లెక్సీల పిచ్చి. లోకల్ రాజకీయ నాయకుడితో ఫొటో దిగి ఫ్లెక్సీ వేయిస్తాడు. కానీ అది మాయమవుతుంది. మరోవైపు జీవితంలో ఫెయిలయ్యానని కార్తీక్ (కార్తిక్ రత్నం) మద్యానికి బానిస అయిపోతాడు. ఇంకోవైపు  ఐశ్వర్య (రుహానీ శర్మ), వరుణ్ (విరాజ్ అశ్విన్) ప్రేమికులు. కానీ తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పే ధైర్యముండదు. మరి ఈ నలుగురి జీవితాల్లో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement