
Today Gold and Silver Price పసిడి ధరలు శనివారం మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో విలువైన రెండు లోహాల ధరలు ఊపందుకున్నాయి. హైదరాబాద్‌లో శుక్రవారం 350 రూపాయలకు పైగా పడిన 22 క్యారెట్ల పసిడి శనివారం 10 గ్రాములు రూ.250 ఎగిసి రూ.55,350 స్థాయికి చేరింది.
అలాగే 24 క్యారెట్ల గోల్డ్ 270 రూపాయలు పుంజుకుని రూ.60,380గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, పొద్దుటూరు, గుంటూరు నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధర కిలోకి మరోసారి 80వేలకు చేరింది. 500 రూపాయలు పెరిగి కిలోకు రూ.80,000 పలుకుతున్నది. శుక్రవారం 2వేల రూపాయల మేర క్షీణించిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.55,600గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.60,640 పలుకుతోంది. f వెండి కిలో 600 రూపాయలు పెరిగి 77,000 పలుకుతోంది. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతూ ఉంటాయనే విషయాన్ని గమనించాలి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి