Today Gold and Silver Prices పండగ సీజన్‌లో బంగారం, వెండి ధరలు వరుసగా దిగి వస్తున్నాయి. గత రెండు మూడు సెషన్లుగా వరుసగా తగ్గుతున్న బంగారం నేడు మరింత క్షీణించింది. మరో ముఖ్యమైన మెటల్ వెండి ధర కూడా దిగి వస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరలు, డాలరు బలం నేపథ్యంలో దేశీయంగా తులం పసిడి ధర రూ. 60 వేల దిగువకుచేరింది. (మోడ్రన్ కార్లలో సెక్స్ నుంచి పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్)
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కూడా బుధవారంతో పోలిస్తే నేడు తక్కువగానే ఉన్నాయి. అక్టోబర్ 5 డెలివరీకి సంబంధించిన 10 గ్రా.పసిడి రూ. 59043 వద్ద కొనసాగుతోంది. అలాగే నవంబర్ 30 డెలివరీకి సంబంధించిన MCX సిల్వర్ కిలోకు 72271 వద్ద ప్రారంభమైంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి!
హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రా. 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 54,900వద్ద ఉంది.అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 59,890 గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల, 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 55050 వద్ద, 60,040 వద్ద ఉన్నాయి. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో ఏకంగా వెయ్యి రూపాయలు పతనమైన 77, 500 వద్ద ఉంది. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి.