గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈ రోజు రేట్లు పెరుగుదల వైపు పయనించాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో పాటు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 5770.. కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6295గా ఉంది. ఈ లెక్కన తులం బంగారం రేటు వరుసగా రూ. 57700, రూ. 62950గా ఉంది. నిన్నటి కంటే కూడా ఈ రోజు ధరలు రూ.100, రూ.120 పెరిగినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం రూ. 100 పెరిగింది.. 24 క్యారెట్ల ధరలు ఏకంగా రూ. 880 తగ్గి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దీంతో నేడు 10 గ్రామ్స్ గోల్డ్ రేట్లు ఢిల్లీలో రూ. 57850 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63100 (24 క్యారెట్స్ గోల్డ్)కు చేరింది.
చెన్నైలో కూడా నేడు బంగారం ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ మీద రూ. 100, 24 క్యారెట్ ధర మాత్రం రూ. 110 పెరిగినట్లు సమాచారం. ఈ లెక్కన తులం పసిడి ధరలు రూ. 58200, రూ. 63490కు చేరింది.
ఇదీ చదవండి: గుజరాత్ సమ్మిట్‌లో కనిపించని 'ఎలోన్ మస్క్'.. టెస్లా ఫ్యూచర్ ఏంటి?
వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి మాత్రం స్థిరంగా ఉంది. దీంతో నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడలో కూడా వెండి ధరలు ఈ రోజు పెరలేదు.
Comments
Please login to add a commentAdd a comment