ఫిబ్రవరి 7న పెరిగిన బంగారం ధరలు, ఆ తరువాత దాదాపు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ కథనంలో నేడు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి? చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 57600 (22 క్యారెట్స్), రూ.62840 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ.110 తగ్గినట్లు తెలుస్తోంది.
చెన్నైలో నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు, ఈ రోజు రూ.200 నుంచి రూ.220 వరకు తగ్గింది. దీంతో చెన్నైలో ఈ రోజు తులం బంగారం ధరలు వరుసగా రూ. 58100 (22 క్యారెట్స్), రూ. 63380 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి.
ఢిల్లీలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 100 తగ్గి 57750 రూపాయలకు.. 24 క్యారెట్ల ధర రూ. 110 తగ్గి 62290 రూపాయలకు చేరింది.
వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి మాత్రం ఈ రోజు స్థిరంగా ఉంది. దీంతో విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో మాత్రమే కాకుండా చెన్నై, ఢిల్లీ నగరాల్లో నిన్న రూ. 500 తగ్గిన వెండి ధరలు ఈ రోజు నిశ్చలంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: 'వాలెంటైన్స్ డే' రోజు షాకివ్వనున్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్!
Comments
Please login to add a commentAdd a comment