
Gold & Silver rate today : దేశంలో ఈరోజు (ఆగస్ట్ 14) వెండి ధర భారగా తగ్గింది. మరోవైపు బంగారం ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ఆభరణాలు, వస్తువులు చేయించుకునేవారికి ధరలు తగ్గడం ఊరటగా నిలిచింది. అలాగే పసిడి ధరల్లో పెరుగుదల లేకపోవడంతో బంగారం కొనుగోలుదారులకు అనుకూలంగా మారింది.
బంగారం ధరలు
దేశంలోని పలు నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం (22 క్యారెట్లు) ధర రూ. 54,650గా కొనసాగుతోంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 59,620గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది.
భారీగా తగ్గిన వెండి ధర
దేశంలో ఈరోజు (ఆగస్ట్ 14) వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. కేజీ వెండి ధర రూ. 3,200 మేర తగ్గింది. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 7,300గా ఉంది. కేజీ వెండి ధర రూ. 73,000గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 76,200గా ఉండేది.
ఇదీ చదవండి: ఈ రోజు బంగారం & వెండి ధరలు