న్యూఢిల్లీ: పసిడి ధరలు మరోసారి రికార్డు స్థాయికి పెరిగాయి. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పుంజు కోవడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా వారం రోజుల్లో అక్షయ తృతీయ రానున్న తరుణంలో కొనుగోలు దారులకు భారీ షాకిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఆల్‌టైం హైకి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.480 పెరిగి రూ.61,780కి చేరింది. వెండి సైతం కిలో రూ.410 పెరిగి రూ.77,580 స్థాయికి ఎగిసింది. స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 2,041డాలర్ల వద్ద, వెండి ఔన్స్ 25.88 డాలర్లుగా ఉంది. (27వేల మంది తొలగింపు: అమెజాన్ సీఈవో కీలక వ్యాఖ్యలు)
దేశీయంగా హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 600 రూపాయలు ఎగిసి 61,200 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 550పెరిగి 56, 650 వద్ద ఉంది. అలాగే మరో విలువైన లోహం వెండి ఏకంగా కిలోకి 1200 రూపాయలు పెరిగి రూ.83,800గా ఉంది. మార్చి1న రూ. 70వేలుగా ఉన్న కిలో వెండి ధర మార్చి 31 నాటికి 77500 స్థాయికి చేరింది. తాజాగా 83వేలకు చేరడం విశేషం. (సల్మాన్ ఖాన్ మూవీ బూస్ట్: ఏకంగా 21 వేల కోట్లకు ఎగబాకిన బిజినెస్‌మేన్)
అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగానూ ప్రభావం చూపుతున్నట్టు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. అటు ఆరు కరెన్సీల బాస్కెట్‌కు వ్యతిరేకంగా గ్రీన్‌బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 101 మార్క్ దిగువకు పడి పోయింది. మార్చిలో అమెరికా పీపీఐ ఇండెక్స్ ఊహించని విధంగా క్షీణించడంతో వారంవారీ జాబ్‌లెస్ క్లెయిమ్‌ల సంఖ్య 2,39,000 పెరిగింది. దీంతో ట్రెజరీ దిగుబడులు కూడా తగ్గినట్టు తాజా గణాంకాల ద్వారా తెలుస్తుంది.
(ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ)
Comments
Please login to add a commentAdd a comment