సాక్షి,ముంబై: గత కొద్దిరోజులుగాఆకాశనుంచి దిగొస్తూ మురిపించిప పసిడి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. రానున్న పెళ్లిళ్ల సీజన్‌లో ఊరట చెందాలనుకున్న పసిడి ప్రియులకు ఇది చేదు వార్త. తాజాగా గురువారం కూడా బంగారం, వెండి ధరలు వేగాన్ని అందుకున్నాయి.
బుధవారం ట్రేడింగ్ ధరతో పోలిస్తే హైదరాబాదులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450 పలుకుతోంది. గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,175 గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,200కి చేరింది. ఇక ముంబై, కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,600(గురువారం)గా ఉంది చెన్నైలో రూ. 52,350, ఢిల్లీ, జైపూర్ , లక్నోలో రూ. 51,750. మరోవైపు ఢిల్లీ, కోల్‌కతా, పూణేలో కిలో వెండి ధర రూ.66,800గా ఉంది.
గ్లోబల్‌గా
రాయిటర్స్ ప్రకారం, వడ్డీ రేట్లు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం ఉంటాయనే పెట్టుబడిదారుల ఆందోళనలను గ్లోబల్ ఎకనామిక్ డేటా మరింత పెంచింది. డాలర్ పుంజుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఒక వారం గరిష్ట స్థాయికి చేరిన స్పాట్ బంగారం 0.2శాతం తగ్గి ఔన్సుకు 1,833.57 డాలర్ల వద్ద ఉంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం నష్టంతో 1,840.50 డాలర్లుగా ఉంది. కాగా బుధవారం వరుసగా మూడవ సెషన్‌లో లాభంతో గత వారం నుండి బంగారం దాదాపుగా తన నష్టాలనుంచి కోలుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment