
సాక్షి, ముంబై: కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు. అయితే మీకో చక్కటి అవకాశం. కీవే ఇండియా కంపెనీ తన లేటెస్ట్ 300 సీసీ బై బైక్స్ ధరలను భారీగా తగ్గించింది. కే300 ఎన్, కే 300 ఆర్ మోడళ్లపై భారీ తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. (మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత)
కంపెనీ తాజా నిర్ణయంతో నేక్డ్ స్ట్రీట్ వెర్షన్ బైక్ కే 300 ఎన్ ధర రూ. 2.65 లక్షల -రూ. 2.85 లక్షల దాకా ఉంది. ఈ మోడల్‌పై ఇపుడు 33వేల రూపాయల దాకా తగ్గింపు లభిస్తోంది. అలాగే రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.2 లక్షల ధర పలికే కే 300 ఆర్ ధర ఇపుడు రూ. 55 వేలు దిగి వచ్చింది. అంటే దీన్ని రూ. 2.65 లక్షలకే కొనుగోలు చేయవచ్చు.
కే 300 ఎన్, కే 300 ఆర్ అనే బైక్స్ రెండూ కూడా ఒక ప్లాట్‌ఫామ్‌పై తయారైనవే. వీటిల్లో 292 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది హెచ్‌పీ 27.5. అలాగే టార్క్ 25 ఎన్ఎం ను అందిస్తాయి. బైక్ ముందు, వెనుక డిస్క్ బ్రేకులు, అలాగే డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్,డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైట్లు , 2 రైడింగ్ మోడ్‌లు(ఎకో & స్పోర్ట్)హైలైట్ ఫీచర్లుగా చెప్పుకోవచ్చు. ఈ ధరలు 6 ఏప్రిల్ 2023 నుండి అమల్లోకి రాగా రెండు మోడల్‌లలోని మొత్తం 3 కలర్ ఆఫర్‌లలో ప్రామాణికంగా ఉంటాయి.