సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ప్యూర్ ఈవీ కొత్త ఇ-స్కూటర్‌ను పరిచయం చేసింది. ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ ప్రో పేరుతో టాప్ ఎండ్ మోడల్ స్కూటర్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. PURE EV ePluto 7G ప్రో రూ. 94,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరగా ప్రకటించింది. బుకింగ్‌లను ఇప్పటికే ప్రారంభించగా, డెలివరీలు మే 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయి. (మోటో వాచ్ 200 వచ్చేస్తోంది...ఫీచర్లు చూశారా!)
ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ ప్రో : బ్యాటరీ, ఫీచర్లు
ఏఐఎస్ 156 సర్టిఫైడ్ 3.0 kWh బ్యాటరీ ప్యాక్, 1.5 kW ఎలక్ట్రిక్ మోటార్‌ను ఇందులోజత చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంపిక చేసిన మోడ్‌ను బట్టి ఒకే ఛార్జ్‌పై 100 -150 కిమీల డ్రైవింగ్ పరిధిని అందిస్తుందని, మూడు రైడింగ్ మోడ్‌లు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. స్మార్ట్ బీఎంఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ, రౌండ్ LED హెడ్‌ల్యాంప్ లాంటి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. మాట్ బ్లాక్, గ్రే , వైట్ మూడు కలర్ వేరియంట్‌లలో ఇది లభించనుంది.
తమ బెస్ట్ సెల్లింగ్ 7జీ మోడల్‌కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్ అని, లాంగర్ రేంజ్ స్కూటర్లను కోరుకునే కస్టమర్ల లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చినట్టు ప్యూర్ ఈవీ కో-ఫౌండర్, సీఈఓ రోహిత్ వదేరా లాంచింగ్ సందర్బంగా తెలిపారు. ప్రీ-లాంచ్ టైంలోనే 5వేల బుకింగ్‌లను అందుకున్నామంటూ సంతోషం ప్రకటించారు. తొలి నెలలో 2వేలకు పైగా బుకింగ్‌లను ఆశిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment