Bajaj Chetak Electric Scooter Price Cut: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈక్రమంలో ఈ ఏడాది మార్చిలో బజాజ్ ఆటో రెండు వేరియంట్లలో అప్‌డేట్ చేసిన 2023 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రకటించింది. తాజాగా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.
చేతక్ఈవీ ధరలను తగ్గించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. బేస్ చేతక్ ధర రూ.1.22 లక్షలు కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.1.52 లక్షలు. అయితే ఇప్పుడు, బేస్ వేరియంట్ నిలిపి వేసింది. అలాగే ప్రీమియం వేరియంట్ ధర రూ. 22 వేల తగ్గింపును అందిస్తోంది. దీని ప్రకారం రూ. 1.3 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్ ఎప్పటివరకు అందుబాటులో ఉంటుందనే వివరాలు అందుబాటులో లేవు. (టెక్ దిగ్గజం ఇంటెల్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్)
బజాజ్ చేతక్ ఇ-స్కూటర్ ఫీచర్లు
చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రష్‌లెస్ DC మోటార్‌తో ఆధారితంగా 60.3Ah కెపాసిటీ కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీతో. ఇది 4.08 kW గరిష్ట శక్తిని16 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీని 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీన్ని కేవలం ఒక గంటలో 25 శాతం ఛార్జ్ చేయవచ్చు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్‌ఈడీ లైటింగ్, ఆల్-కలర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, యాప్ ఆధారిత నోటిఫికేషన్లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని పొందుతుంది. హార్డ్‌వేర్ పరంగా, ఇది సింగిల్-సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్, రియర్ మోనోషాక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ,రియర్ డ్రమ్ బ్రేక్స్ లాంటివి ఉన్నాయి.2023 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీమియమ్ ఎడిషన్ వెర్షన్ మూడు రంగులలో లభిస్తుంది. (వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!)
Comments
Please login to add a commentAdd a comment