
Today Gold and Silver Prices:తగ్గినట్టే తగ్గి వినియోగదారులను ఊరించిన వెండి,బంగారం ధరలు పరుగందుకున్నాయి. దాదాపు గత రెండు నెలలుగా స్తబ్దుగా ఉన్న గోల్డ్ ధరల క్రమంగా వేగం పుంజుకుంటోంది. ముఖ్యంగా పవిత్రశ్రావణమాసం సందడి నేపథ్యంలో దేశీయంగా వెండి బంగారం ధరలు ఊపందుకున్నాయి. తులం బంగారంపై ఏకంగా రూ.60 మేర పెరిగి షాక్ ఇచ్చింది. అటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం , వెండి ధరలు రెండూ పెరిగాయి. (ఎక్స్ టేకోవర్: ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు,అసలేం జరుగుతోంది?)
22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.50 పెరిగి రూ.54,200 పలుకోంది.ఇక 24 క్యారెట్ల బంగారం ధర10 గ్రాములకు రూ.60 పెరిగి రూ. 59,130కి చేరుకుంది. ఇక వెండి ధర అయితే ఏకంగా 1500 జంప్‌చేసింది. ప్రస్తుతం కిలో వెండిరూ.78000 చేరుకుంది. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా పసిడి ధరలు లాభాల్లోనే ఉన్నాయి. ఔన్స్ ధర 1,902.96డాలర్ల వద్ద ఉంది. (యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రొ: భారీ తగ్గింపు )