Gold And Silver Rate Today: దేశంలో బంగారం ధరలు మళ్లి పరుగందుకున్నాయి. ఒక వైపు ఎడతెగని వర్షాలతో దేశంలోని చాలా ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. మరోవైపు బులియన్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు గురువారం జోరందుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. (బ్లాక్‌రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం)
22క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 300 పెరిగి, రూ. 55,450 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగాం పది గ్రాములు 330 రూపాయలు ఎగిసి రూ. 60,490కి చేరింది. వెండి కూడా ఇదే బాటలో ఉంది. (మారుతి జిమ్నీని సింగిల్ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో)
హైదరాబాద్ మార్కెట్లె పుత్తడి పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 55,450 గానూ, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,490గానూ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలో కొన సాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,640గా ఉంది.
వెండి ధగ ధగలు
దేశీయంగా వెండి ధరలు కూడా పుంజుకున్నాయి. వెండి కిలో ధర 1100 రూపాయిలు ఎగిసింది. హైదరాబాద్‌లో కిలో వెండి 8,1500గా ఉంది.
అమెరికా ఫెడ్ నిర్ణయం
అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేటు పెంపు మరింత ఆందోళనకు దారి తీసింది. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు దీంతో వడ్డీరేటు పెంపు ఉండదన్న ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు జల్లినట్టైంది. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోనుందని అంచనాలు ఊపందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment