Today Gold and Silver Rate: దేశీయంగా గత రెండు మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధర శనివారం బులియన్ మార్కెట్‌లో మళ్లీ ఎగిసాయి. అటు వెండి ధర కూడా మళ్లీ పరుగందుకుంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు ఊపందుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,310 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,310 వద్ద కొనసాగుతున్నది. (అంత లేదు...నేనూ సంపాదిస్తున్నా: మండిపడిన సమంత)
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 200 ఎగిసి రూ.55150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 210 రూపాయలు పుంజుకని 60,160గా పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర విషయానికి వస్తే కొనుగోలు దారులకు షాక్ తగిలింది. ఏకంగా 300 రూపాయలు ఎగిసి కిలోవెండి 78500గా ఉంది. గ్లోబల్‌గా ఔన్స్ బంగారం ధర పుంజుకుంది .యూఎస్ జాబ్ డేటా అమెరికన్ డాలర్, బాండ్ ఈల్డ్స్ క్షీణత అని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి. (మహిళల రికార్డ్: వారి టార్గెట్ పక్షి కన్నే, గర్వంగా ఉంది: ఆనంద్ మహీంద్ర ప్రశంసలు)
ఇదీ చదవండి: తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ
Comments
Please login to add a commentAdd a comment