
భారత్‌లో నిప్పులు కురిపిస్తున్న వాల్కెనో
పనాజీ: భారత్‌లో ఉన్న ఏకైక వాల్కెనో 150 ఏళ్ల తర్వాత మేల్కొంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న బారెన్ ఐలాండ్ వాల్కెనో విస్ఫోటనం చెందినట్లు గోవాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్‌ఐఓ) శుక్రవారం పేర్కొంది. చివరగా 1991లో లావాను బయటకు చిమ్మినట్లు తెలిపింది. ప్రస్తుతం వాల్కెనో నుంచి పెద్ద ఎత్తున పొగలు, లావా బయటకు వస్తున్నట్లు చెప్పింది.
గత నెల 23వ తేదీన బారెన్ అగ్నిపర్వతాన్ని పరిశీలించడానికి శాస్త్రవేత్తలు వెళ్లగా.. ఒక్కసారిగా పొగలు బయటకు చిమ్మడం ప్రారంభమైనట్లు తెలిపింది. పగటి సమయంలో కేవలం పొగ మబ్బులను గమనించిన శాస్త్రవేత్తల బృందానికి రాత్రి సమయంలో పెద్ద సైజులో ఎర్రటి లావా ముద్దలు వెలువడుతున్నట్లు గుర్తించారు.