
ఏపీలో లావా మొబైల్ అసెంబ్లింగ్ యూనిట్?
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ లావా రూ.250 కోట్ల పెట్టుబడి అంచనాతో దేశంలో ఒక మొబైల్ అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని కోసం ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని లావా ఇంటర్నేషనల్ డెరైక్టర్ విశాల్ సెహగల్ తెలిపారు. లావాకు ప్రస్తుతం నోయిడాలో ఒక అసెంబ్లింగ్ యూనిట్ ఉంది.
జోలో ‘బ్లాక్’ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ: లావా కంపెనీ తన జోలో సిరీస్‌లోనే ‘బ్లాక్’ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.12,999. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల తెర, 13 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 4జీ, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని విశాల్ సెహగల్ చెప్పారు.