న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీ కంపెనీ లావా తాజాగా తన ‘జడ్93’ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అధిక గ్రాఫిక్స్ కలిగిన ఆటలను ఆడేందుకు వీలుగా ‘స్మార్ట్ ఏఐ గేమింగ్ మోడ్’ను ఈ ఫోన్ కలిగి ఉందని కంపెనీ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,999 వద్ద నిర్ణయించింది. వెనుకవైపు 13మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2ఎంపీ సెకండరీ సెన్సార్ కమెరా.. 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.22 అంగుళాల డిస్‌ప్లే ఇందులో స్పెసిఫికేషన్లుగా కంపెనీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment