న్యూఢిల్లీ: నేటి యువత అభిరుచులకు అనుగుణంగా 6 అంగుళాల స్క్రీన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ ‘లావా జెడ్ 62’ను లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ విడుదల చేసింది. అరు అంగుళాల ఫుల్ వ్యూ (నాచ్ తక్కువగా ఉండే) ఐపీఎస్ డిస్‌ప్లేతో కూడిన ఈ ఫోన్ ఉంటే టీవీ అవసరం లేదని, వీడియో వీక్షణ అనుభవం గొప్పగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ‘త్రో యువర్ టీవీ’ పేరుతో ఓ ఆఫర్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద తమ పాత టీవీని ఇచ్చి జెడ్62 స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకోవచ్చని తెలిపింది. స్టాక్ ఉన్నంత వరకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఆఫర్ కోసం కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ నెల 18 నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించింది. జెడ్62 ఫోన్‌లో ప్రత్యేకంగా గూగుల్ అసిస్టెంట్ కీని కంపెనీ ఏర్పాటు చేసింది. దీని సాయంతో కోరుకున్న యాప్‌ను వాయిస్ కమాండ్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. 3,380 ఎంఏహెచ్ ఆర్టిఫీషియల్ ఇన్‌టెలిజెన్స్ బ్యాటరీ ఇందులో ఉంది. ఫేస్ అన్‌లాక్, 8మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్ ఏఐ స్టూడియోమోడ్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.6,060.
Comments
Please login to add a commentAdd a comment