
లావాతో కరెంటు!
లండన్: భూగర్భంలో కుతకుతలాడుతూ ఉండే శిలాద్రవం (మాగ్మా) సాయంతో విద్యుత్‌ను ఉత్పత్తి చే సే కొత్త ఐడియాను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్‌సైడ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఐస్‌ల్యాండ్‌లో 2009లో ఐస్‌ల్యాండిక్ డీప్ డ్రిల్లింగ్ ప్రాజెక్టు చేపట్టిన శాస్త్రవేత్తలు అనుకోకుండానే ఈ కొత్త పద్ధతిని గుర్తించారు. ప్రాజెక్టు కోసం ఓ చోట 2,100 మీటర్ల లోతుకు తవ్వగానే భూమి పై పొరలోకి చొచ్చుకువచ్చిన ఓ మాగ్మా ప్రదేశం తగిలింది. సుమారు 900 నుంచి 1000 డిగ్రీ సెల్షియస్‌ల ఉష్ణోగత్రతో ఉన్న లావా రెండేళ్ల పాటు నిరంతరమూ ఆవిరిని ఎగజిమ్మింది.
మామూలుగా అయితే మాగ్మా ఇంకా చాలా లోతులో ఉంటుందని, ఇలా చాలా తక్కువ లోతులోనే ఇలాంటి ప్రాంతం ఉన్నట్లు వెల్లడి కావడం ఇది రెండోసారి మాత్రమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ లావా వల్ల వెలువడే నీటిఆవిరి ద్వారా విద్యుత్‌ను భారీగా తయారు చేయవచ్చని, దీనివల్ల ఒక్కచోట మాగ్మా ఆవిరితోనే సుమారు 36 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంటున్నారు.