పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న శవ శిలలు
పాంపే : దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం అగ్ని పర్వతపు లావాలో చిక్కుపోయి శిలలా మారిన ఇద్దరు వ్యక్తుల శవాలు తాజాగా బయటపడ్డాయి. ఇటలీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు వీటిని వెలికి తీశారు. శనివారం వీటికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. క్రీస్తుపూర్తం 79లో పాంపేలోని ప్రాచీన రోమన్ సిటీకి దగ్గరలోని మౌంట్ వెసువిస్ అగ్ని పర్వతం బద్దలైంది. దీంతో లావా ఉప్పొంగి అక్కడికి దగ్గరలోని ఊర్లను కప్పేసింది. లావా నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించినప్పటికి ప్రజల వల్ల కాలేదు. లావాలో చిక్కుకుని ప్రాణాలు వదిలారు. అయితే లావాతో కప్పబడి పోయిన శవాలు మాత్రం చెక్కు చెదరకుండా మిగిలిపోయాయి. ( వైరల్: చిరుత ఇంతలా భయపడ్డం చూసుండరు )
భూగర్భ ప్రాంతంలో శవ శిలలు
2017లో ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరపగా.. మూడు గుర్రాల శిలలు బయటపడ్డాయి. తాజాగా నవంబర్ నెలలో ఇద్దరు వ్యక్తులకు చెందిన శవ శిలలను కనుగొన్నారు. లావానుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించిన ధనికుడు అతడి సేవకుడికి చెందిన శవాలుగా గుర్తించారు. ఓ వ్యక్తికి 18-25 సంవత్సరాల వయస్సు.. మరో వ్యక్తికి 30-40 ఏళ్ల వయసు మధ్య ఉంటుందని తెలిపారు. లావానుంచి తప్పించుకోవటానికి సురక్షితమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ భూగర్భ ప్రాంతంలోకి వచ్చి ఉంటారని, అక్కడే లావాకు బలయ్యారని తెలిపారు. నవంబర్ 18వ తేదీన తీసిన ఫొటోలను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment