
సాక్షి, న్యూఢిల్లీ : శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వాడివేడిగా సభ జరగాల్సిన సమయంలో భారీ వర్షం ఢిల్లీని ముంచెత్తింది. భారీ వర్షం దెబ్బకు ఢిల్లీలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇక వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రభుత్వంపై తొలిసారి అవిశ్వాసం జరగనుండటంతో దేశం మొత్తం ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తోంది.
అవిశ్వాస తీర్మానంతో వాడి వేడిగా జరగనున్న వర్షాకాల సమావేశాలను కవర్ చేయడానికి దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు ఢిల్లీలో పాగావేశాయి. అయితే శుక్రవారం కురిసిన భారీ వర్షానికి వార్తా సంస్థల ఎలక్ట్రానిక్ పరికరాలు తడిచిపోయాయి. కెమెరాలు, ఇతర కవరేజి వస్తువులు తడిసిముద్దయ్యాయి.