దూరంలో ఉన్న ఆబ్జెక్ట్‌లను ఫోన్‌లో బంధించడం అంటే మీకిష్టమా? జూమ్ చేస్తే ఫోటోల క్లారిటీ మిస్సవుతుందా? ప్రొఫెషనల్‌గా ఫోటోలు తీసేందుకు డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. కెమెరాతో పని లేకుండా చేతిలో ఉండే ఫోన్‌లతో దూరంలో ఉన్న వ్యక్తుల్ని, వస్తువుల్ని హై క్వాలిటీతో ఫోటోలు తీయొచ్చు. ఎలా అంటారా?!
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.ఈ ఏడాదిలో టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫోన్ విడుదల తరువాత ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌లలో భారీ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2023లో యాపిల్ సంస్థ ఐఫోన్ 15 సిరీస్‌లోని ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మోడళ్లను యూజర్లకు పరిచయం చేయనుంది. అయితే ఈ ఫోన్ రేర్ కెమెరా సిస్టమ్‌లో పెరిస్కోప్ లెన్స్ ఉండనున్నాయి. ఈ ఫీచర్ సాయంతో ఇప్పుడున్న ఐఫోన్13, ఐఫోన్14 సిరీస్ ఫోన్‌ల కంటే ఐఫోన్15 ఫోన్ కెమెరాతో మన కంటికి కనిపించే రేణువుల్ని సైతం హైక్వాలిటీలో జూమ్ చేసి మరి వీక్షించవచ్చు. అనలిస్ట్ జెఫ్ పీయూ ప్రకారం.. ఐఫోన్ 15 ప్రోలో ఉన్న ఓ మూడు కెమెరాలలోని ఓ కెమెరాను పెరిస‍్కోప్ లెన్స్‌ను యాపిల్ అమర్చనున్నట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతం ఐఫోన్ 13 ప్రో 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్ కంటే మెరుగ్గా..ఐఫోన్ 15 ప్రో కెమెరాను 10ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చని అన్నారు.
కొత్తేం కాదు
ఐఫోన్ 15ప్రోలో అందుబాటులోకి తెచ్చే ఈ పెరిస్కోప్ లెన్స్ కొత్త ఫీచర్లేం కాదు. ఇప్పటికే పలు ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లైన శాంసంగ్ గెలాక్సీ ఎస్21 అల్ట్రా, హువావే పీ40 ప్రో ప్లస్ ఫోన్‌లలో రేర్ కెమెరాలో ఈ పెరిస్కోప్ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమరాల సాయంతో జర్నీలో లేదంటే, వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు ఈ పెరిస్కోప్ లెన్స్‌లోని ఫోక్స్(వెలుతురు) యాంగిల్ మిర్రర్ మీదిగా ప్రతిభింభించి మనం చూడాలనుకున్న టార్గెట్ మీద పడుతుంది. దీంతో చికటి కాస్తా వెలుతురు వెదజల్లుతుంది. అంతేకాదు జూమ్ చేసేందుకు, ఏదైనా ఫోటో బ్లెర్‌గా ఉన్న మనకు స్పష్టంగా కనిపించేలా చేస్తుంది.
రెండేళ్ల నుంచి ప్రచారం..
యాపిల్ ఐఫోన్‌లలో పెరిస్కోప్ ఫీచర్‌ను అదిగో అప్పుడు తెస్తుందని, ఇదిగో ఇప్పుడే తెస్తుందంటూ టెక్ మార్కెట్‌లో గత రెండేళ్ల నుంచి ప్రచారం కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు అలాంటి ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొని రాలేదు. ఇదే అంశంపై ప్రఖ్యాత విశ్లేషకుడు మింగ్-చి కువో మాట్లాడుతూ..పెరిస్కోప్ కెమెరా ఐఫోన్ 14 ప్రోలో ఉంటుందని, కానీ తాజాగా చిప్‌తో పాటు ఇతర కారణాల వల్ల ఐఫోన్ 15ప్రో ఈ పెరిస్కోప్ కెమెరాతో మార్కెట్‌లో విడుదలవుతుందని అన్నారు. ఐఫోన్ 13 ప్రో మోడల్‌లలో సాధారణ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సర్వ సాధారణం. అయితే అనేక ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఇప్పటికే 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కెమెరాలను మార్కెట్‌లోకి విడదల చేస్తున్నాయి. అంతేకాదు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఫోటోలు, వీడియోలు తీసేందుకు డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాల అవసరం ఉండదని, ఫోన్‌తోనే దూరంగా ఉన్నా సరే ఫోటోల్ని అందంగా తీయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment