
చైనా మొబైల్ దిగ్గజం షావోమి సరికొత్త రికార్డు నమోదు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా , దేశంలో నెంబర్ 1 బ్రాండ్‌గా కొనసాగుతున్న షావోమి మరో సంచలనానికి నాంది పలకనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.. ఈ మేరకు ట్విటర్‌లో ఫోటోను షేర్ చేసింది. ఎంఐ నోట్ 10, ఎంఐ నోట్ 10 ప్రొ (ఎంఐ సీసీ9 ప్రొ) పేరుతో స్మార్ట్‌ఫోన్లను తీసుకు రానుందని తెలుస్తోంది. విభిన్న ప్రాసెసర్‌లతో, అద్భుతమైన ఫీచర్లతో ఇవి ఆకట్టుకోనున్నాయని టిప్‌స్టర్ ముకుల్ శర్మ కూడా ట్వీట్ చేయడం విశేషం.
స్మార్ట్‌ఫోన్ల కెమెరాల యుగంలో ఒక కొత్త శకం ప్రారభం కానుందని ట్వీట్ చేసింది. చైనాలో ఎంఐ సీసీ9 ను నవంబరు 5న లాంచ్ చేయనున్నామంటూ టీజర్‌ను వదిలింది. కాగా ఇప్పటికే ఆన్‌లైన్‌లొ లీకైన వివరాల ప్రకారం ఎంఐ సీసీ 9 ప్రొ స్నాప్‌డ్రాగన్ 730 జి ప్రాసెసర్‌ను కలిగి ఉండగా, ఎంఐ నోట్ 10 ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 సాక్ ప్రాససర్‌ను అమర్చినట్టుతెలుస్తోంది.
Introducing the world's FIRST 108MP Penta Camera. A new era of smartphone cameras begins now! #MiNote10 #DareToDiscover pic.twitter.com/XTWHK0BeVL
— Xiaomi #First108MPPentaCam (@Xiaomi) October 28, 2019
Comments
Please login to add a commentAdd a comment