
స్మార్ట్ ఫోన్లలో కెమెరాదే పైచేయి!
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్ల వాడకం జనాభాతో సమానంగా పరుగులు తీస్తుంటే.. ఇందులో స్మార్ట్ ఫోన్ల సందడి అంతా ఇంతా కాదు. రోజుకో కొత్త మొబైల్. గంటకో టెక్నాలజీ. ఇలా పరుగులు తీస్తూనే ఉంది ఫోన్ ప్రపంచం. అయితే యువత స్మార్ట్ ఫోన్ల వాడకంలో ఎన్నో రకాలైన ఫీచర్లను కల్గి ఉన్నా.. అందులోని కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట. ఈ విషయాన్ని తాజాగా ఓ సర్వే స్పష్టం చేసింది. ఇందుకు 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉన్న 1,019 యువతను ఎంచుకున్నారు. వీరిలో 90 శాతం మంది మాత్రం తాము ఫోటోలు తీయడానికి స్మార్ట్ ఫోన్ కెమెరానే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోని వారంలోని అధికమొత్తంలో తాము తీసిన ఫోటోలను స్నేహితులతో షేర్ చేసుకుంటామన్నారు.
అయితే తాము పంపే వాటిలో సెల్ఫీ ఫోటోలే కాకుండా.. ఇంట్లోని వస్తువులను కూడా ఫోటోల రూపంలో పంపుతామని వారు స్పష్టం చేస్తున్నారు. కాగా, 78 శాతం మంది మాత్రం రోజులో కనీసం రెండ గంటలపాటు ఫోన్లలో గడుపుతామని తెలిపారు.