న్యూఢిల్లీ: రిజర్వు చేసుకున్న సీటులో వేరేవారు కూర్చోవడంతో తీవ్ర ఇబ్బందిపడ్డ∙ఓ ప్రయాణికుడికి రూ.75 వేలు పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.2013, మార్చి 30న వి.విజయ్‌కుమార్ విశాఖపట్టణం నుంచి ఢిల్లీకి వెళ్లే దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌కు టికెట్ బుక్ చేసుకున్నాడు.
అయితే అతను వెళ్లేలోపు సీటును మరొకరు ఆక్రమించుకుని కూర్చున్నారు. దీంతో కుమార్‌కు మోకాళ్ల నొప్పులు ఉండడంతో లోయర్ బెర్త్ బుక్ చేసుకున్నాడు. దీనిపై టీటీఈకి, ఇతర రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయాలని భావించినా.. ఎవరూ కనిపించలేదు. దీంతో ఢిల్లీ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్‌కి ఫిర్యాదు చేశాడు. కుమార్‌కు సీటు నిర్ధారించడంలో రైల్వే విఫలమైందని, అతనికి రూ. 75 వేల పరిహారం ఇవ్వాలని కమిషన్.. రైల్వేను ఆదేశించింది.