
న్యూఢిల్లీ: రైల్వేలో పదవీ విరమణ చేసినా 65ఏళ్లు వయస్సు దాటని మాజీ ఉద్యోగులకు శుభవార్త. రైల్వేలో వివిధ హోదాల్లో ఖాళీ అయిన పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన రిటైర్డ్ ఉద్యోగులతో భర్తీ చేస్తుండటం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల ప్రకారం 62 ఏళ్ల లోపు వారినే ఇందుకు నియమిస్తున్నారు.
ఇకపై 65 ఏళ్ల లోపు వారు సైతం ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి అర్హతగల వారిని బాధ్యతల్లోకి తీసుకోవాలని జనరల్ మేనేజర్లకు రైల్వే బోర్డు తాజాగా లేఖలు రాసింది. తాత్కాలిక విధుల్లోకి చేరేందుకు సంబంధించిన పథకాన్ని 2019 జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. ఇంతవరకు ఈ గడువు 2018 సెప్టెంబర్ 14వరకే ఉంది. కాగా, సాధారణంగా రైల్వే శాఖలో ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60 ఏళ్లు.