సాక్షి,న్యూఢిల్లీ: కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ఇస్రో సహకారంతో రైల్వేలు భద్రతా వ్యవస్థను పటిష్టం చేయనున్నాయి. ఇలాంటి క్రాసింగ్‌ల వద్ద రోడ్డును ఉపయోగించే వారికోసం శాటిలైట్ ఆధారిత వ్యవస్థ అలర్ట్‌లను పంపుతుంది. కాపలాలేని లెవెల్ క్రాసింగ్‌ల వద్దకు రైలు చేరుకునే సమయంలో ఇస్రో సహకారంతో ఏర్పాటు చేసే వ్యవస్థ రోడ్డు ప్రయాణీకులను హెచ్చరిస్తుంది. ఇస్రో అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ చిప్‌లను 10,000 ట్రెయిన్లలో అమర్చేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి.
ఐసీ చిప్ నుంచి వచ్చే సిగ్నల్ ద్వారా లెవెల్‌క్రాసింగ్‌లకు ఆయా రైళ్లు 500 మీటర్ల దూరంలో ఉండగానే రోడ్డును ఉపయోగించే వారిని సైరన్ ద్వారా అలర్ట్ చేస్తారు. ఢిల్లీ-గౌమతి రాజధాని రూట్‌లో సొనేపూర్ డివిజన్‌కు చెందిన రెండు లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద పైలట్ ప్రాజెక్టుగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ-ముంబయి రూట్‌లోనూ త్వరలో కొన్ని గేట్స్ వద్ద ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా దశల వారీగా ఇస్రో శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఈ హెచ్చరిక వ్యవస్థను నెలకొల్పుతామని సీనియర్ రైల్వే ఉన్నతాధికారి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment