
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లల్లో చిన్న పిల్లలతో కలసి ప్రయాణం చేయడంపై రైల్వే నిషేధం విధించింది. అత్యవసర విధులు నిర్వహించే వారి కోసం ప్రారంభించిన లోకల్ రైళ్లలో, ప్రస్తుతం పలు విభాగాలకు చెందిన ప్రయాణికులందరినీ ప్రయాణం చేసేందుకు అనుమతించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించింది. ఈ క్రమంలో చాలా మంది మహిళలు తమ పిల్లలతో కలసి లోకల్ రైళ్లలో ప్రయాణిస్తుండటం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో చిన్న పిల్లలతో లోకల్ ప్రయాణం ప్రమాదకరమని, పిల్లలతో కలసి లోకల్ రైళ్లలో ప్రయాణించే మహిళలను రైళ్లల్లో అనుమతించబోమని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో మహిళలు మాత్రమే లోకల్ రైళ్లల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకోనుంది. దీనికోసం ఇకపై ముంబైలోని రైల్వే స్టేషన్‌లో గేట్ల వద్ద ఆర్‌పీఎఫ్ జవాన్లను మోహరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment