సాక్షి, న్యూఢిల్లీ : రైళ్లలో ప్రయాణీకులకు అందించే సేవలపై అనుక్షణం పర్యవేక్షించేందుకు సివిల్ డ్రెస్‌లో ఉండే అధికారుల నియామకానికి రైల్వేలు కసరత్తు చేస్తున్నారు. రైళ్లలో ప్రయాణీకుల పట్ల సిబ్బంది ప్రవర్తన, ఆహార పదార్థాల నాణ్యతను ప్రయాణీకుల మాదిరిగా వ్యవహరిస్తూ వీరు పర్యవేక్షిస్తారని రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. సాధారణ ప్రయాణీకుల వలే వీరు రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ఆహార పదార్థాలను కొనుగోలు చేసి వాటి నాణ్యత, సిబ్బంది ప్రవర్తన, సౌకర్యాలపై ఫీడ్‌బ్యాక్ ఇస్తారని వెల్లడించాయి. సిబ్బంది సామర్థ్యం ఆధారంగా వారికి రేటింగ్ ఇస్తారని వెల్లడించాయి.
రైల్వే సేవలను మెరుగుపరిచే క్రమంలో మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న పలు చర్యల్లో ఇవి ఓ భాగమని తెలిపాయి. ప్రయాణీకులు, సిబ్బంది, ఇతర అధికారులతో మాట్లాడటం ద్వారా వారు చెప్పిన అంశాల ప్రాతిపదికన ఈ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు రైల్వే మంత్రిత్వ శాఖకు సమర్పిస్తారు. ఈ సేవలకు అవసరమైన సిబ్బంది నియాకంపై రైల్వే బోర్డు కసరత్తు చేస్తున్నదని, వీటిలో ఎన్‌జీవోలు, పౌర సమాజ సంస్థల సేవలను తీసుకోవాలా అనే ప్రతిపాదననూ పరిశీలిస్తున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment