న్యూఢిల్లీ: రైళ్లలో విక్రయించే టీ, కాఫీ ధరలను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జోన్లకు సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం 150 మి.లీ. టీ, కాఫీల ధరలు రూ.7 నుంచి రూ.10కి పెంచుతున్నట్లు తెలిపింది. టీ బ్యాగ్‌లు, కాఫీ పౌడర్‌లతో తయారుచేసిన వాటికి మాత్రమే ఈ ధరలు అమలవుతాయి. ఇక ముందే తయారుచేసిన రెడీమేడ్ టీని మాత్రం రూ.5కే అమ్ముతారు. పెరిగిన ధరలు రాజధాని, శతాబ్ది రైళ్లలో వర్తించబోవు. దీనికి అనుగుణంగా లైసెన్స్ ఫీజులను మార్చుకోవాలని అన్ని జోన్లను సూచించింది. కుండీలలో (పాట్స్‌లో) టీ విక్రయించే విధానాన్ని నిలిపివేయనున్నట్లు బోర్డు పేర్కొంది. సాధారణంగా 280 మి.లీ. కుండీలో విక్రయించే టీ ధర రూ.10గా ఉండగా, 280 మి.లీ. కాఫీ ధర రూ.15గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment