గ్రేటర్‌లో 30 కి.మీ. మార్గంలో మెట్రో పరుగులకు లైన్ క్లియర్ అయ్యింది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ బృందం నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ.), మియాపూర్–అమీర్‌పేట్ (13 కి.మీ.) మార్గంలో భద్రతా ధ్రువీకరణ జారీ చేయడంతో రైళ్ల వాణిజ్య రాకపోకలకు మార్గం సుగమమైంది.