సాక్షి, హైదరాబాద్: మిలటరీ వారెంట్‌పై రైళ్లలో ఉచితంగా ప్రయాణించే రక్షణ శాఖ సిబ్బంది కచ్చితంగా గుర్తింపు ధ్రువపత్రం చూపాల్సిందేనని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే వారి కుటుంబసభ్యులైతే సంబంధిత శాఖ జారీ చేసిన మెడికల్ కార్డును చూపాలని పేర్కొంది.
కొందరు సాధారణ వ్యక్తులు మిలటరీ వారెంట్ పేరుతో రైళ్లలో ప్రయాణిస్తున్న ఉదంతాలు వెలుగు చూసిన నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే గుర్తింపు కార్డులు చూపని వారిని ఉచితంగా ప్రయాణిం చేందుకు అనుమతించబోమని హెచ్చరించింది.
రైళ్లలో వారు గుర్తింపు కార్డు చూపాల్సిందే!
Published Tue, Mar 7 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
Advertisement