రైల్వేస్‌కు మూడో విజయం  | Senior womens One Day league: A season to look for | Sakshi
Sakshi News home page

రైల్వేస్‌కు మూడో విజయం 

Published Thu, Dec 6 2018 1:41 AM | Last Updated on Thu, Dec 6 2018 1:41 AM

 Senior womens One Day league: A season to look for - Sakshi

సాక్షి, గుంటూరు వెస్ట్‌: బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో రైల్వేస్‌ జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. మహారాష్ట్రతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్‌ 52 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగులు చేసింది. వేద కృష్ణమూర్తి (80 బంతుల్లో 80; 8 ఫోర్లు, సిక్స్‌), హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డి (27 బంతుల్లో 48 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ 29 బంతుల్లో 11 పరుగులు చేసింది.

ఆరో వికెట్‌కు వేద, అరుంధతి కలిసి ఆరు ఓవర్లలో 61 పరుగులు జోడించడం విశేషం. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసి ఓడిపోయింది. రైల్వేస్‌ బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ 46 పరుగులిచ్చి 3 వికెట్లు... ఏక్తా బిష్త్‌ 28 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. సౌరాష్ట్రతో జరిగిన మరో మ్యాచ్‌లో పంజాబ్‌ 91 పరుగుల తేడాతో... గోవాతో జరిగిన మ్యాచ్‌లో చత్తీస్‌గఢ్‌ 26 పరుగుల తేడాతో విజయం సాధించాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement