సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా 200 కొత్త రైల్వే లైన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. నూతన రైల్వే లైన్ ఏర్పాటు పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. రైల్వే ప్రాజెక్టుల సత్వర పూర్తికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన పలు మంత్రిత్వ శాఖల అనుమతులు అవసరమని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజన్ గొహెయిన్ లోక్‌సభలో వెల్లడించారు.
రైల్వే బడ్జెట్‌లో ప్రకటించిన మేర నూతన రైల్వే లైన్‌ల నిర్మాణం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో 9 నూతన లైన్లు, ఏపీలో 18 రైల్వే లైన్‌లను ఏర్పాటు చేస్తుండగా, ఈశాన్య రాష్ట్రాల్లో 15 లైన్‌లను, బిహార్‌లో అత్యధికంగా 34 నూతన రైల్వే లైన్‌లను చేపడుతున్నట్టు చెప్పారు.పశ్చిమ బెంగాల్‌లో 18 రైల్వే లైన్‌లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఇక 2017-18లో స్వచ్ఛభారత్ మిషన్ కింద 21 గ్రీన్ కారిడార్‌లను నెలకొల్పనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోచ్‌లలో బయో టాయిలెట్స్ నిర్మించాలని రైల్వేలు యోచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment