rajen gohain
-
వివిధ దశల్లో 9 రైల్వే లైన్ ప్రాజెక్టులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రూ.14,665 కోట్ల అంచనా వ్యయంతో 1,093 కి.మీ. మేర 9 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుల నిర్మాణం వివిధ దశల్లో జరుగుతోం దని కేంద్ర రైల్వే సహాయ మంత్రి రాజెన్ గొహెయిన్ లోక్‌సభకు తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బుధవారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. మునీరాబాద్–మహబూబ్‌నగర్ లైన్ (246 కి.మీ.)లో 71 కి.మీ. పూర్తయిందని, జక్లేర్–కృష్ణా, చిక్కబెనకల్–యెరమరస్ మధ్య భూసేకరణ పూర్తయిందని పేర్కొన్నారు. మనోహరాబాద్–కొత్తపల్లి లైన్ (148.90 కి.మీ.)లో భూసేకరణ పూర్తయిందని వివరించారు. భద్రాచలం రోడ్డు–సత్తుపల్లి లైన్ (56.25 కి.మీ)లో భూసేకరణ పూర్తయిందని, వంతెనల పనులు, ఇతర పనుల కోసం టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇక అక్కన్నపేట–మెదక్ లైన్ (17.2 కి.మీ )లో 338 ఎకరాలకు గాను 333 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మట్టి పను లు, వంతెనల పనులు ప్రారంభమయ్యాయని తెలి పారు. భద్రాచలం–కొవ్వూరు లైన్ తెలంగాణ విన్నపం మేరకు సత్తుపల్లి మీదుగా నిర్మించేందుకు కేంద్రం అంగీకరించిందని, తెలంగాణ గుండా 48.58 కి.మీ. మేర ఈ లైన్ వెళ్తోందని, అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇందుకు 50 శాతం వ్యయాన్ని భరించాల్సిందిగా కోరగా ఇంతవరకు సమాధానం రాలేదని వెల్లడించారు. ఇక మణుగూరు–రామగుండం లైన్ ప్రాజెక్టుకు కూడా తెలంగాణ ప్రభుత్వం తన వాటాగా 50 శాతం వ్యయం, ఉచితంగా భూమి సమకూర్చాల్సి ఉందని, తెలంగాణ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. కొండపల్లి–కొత్తగూడెం రైల్వేలైన్ నిర్మాణం కోసం కూడా తెలంగాణ నుంచి వ్యయంలో వాటా కోరగా, ఇంకా స్పందించలేదని వివరించారు. -
రైలు ప్రయాణీకులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా 200 కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. నూతన రైల్వే లైన్ ఏర్పాటు పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. రైల్వే ప్రాజెక్టుల సత్వర పూర్తికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన పలు మంత్రిత్వ శాఖల అనుమతులు అవసరమని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజన్ గొహెయిన్ లోక్‌సభలో వెల్లడించారు. రైల్వే బడ్జెట్లో ప్రకటించిన మేర నూతన రైల్వే లైన్ల నిర్మాణం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో 9 నూతన లైన్లు, ఏపీలో 18 రైల్వే లైన్లను ఏర్పాటు చేస్తుండగా, ఈశాన్య రాష్ట్రాల్లో 15 లైన్లను, బిహార్‌లో అత్యధికంగా 34 నూతన రైల్వే లైన్లను చేపడుతున్నట్టు చెప్పారు.పశ్చిమ బెంగాల్లో 18 రైల్వే లైన్లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇక 2017-18లో స్వచ్ఛభారత్ మిషన్ కింద 21 గ్రీన్ కారిడార్లను నెలకొల్పనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోచ్‌లలో బయో టాయిలెట్స్ నిర్మించాలని రైల్వేలు యోచిస్తున్నాయి. -
రైల్వే ప్రయాణీకులకు న్యూ ఇయర్ గిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రయాణీకులకు నూతన సంవత్సర కానుక అందజేసింది. రైల్వే ఛార్జీలను పెంచే ఆలోచనేది లేదని రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం శుభవార్త అందించింది. రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహేన్ పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇవాల్టి లోక్‌సభ సమావేశాల్లో సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి రాజన్ గోహెన్ లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ ఈ తీపి కబురు అందించారు. చార్జీలను పెంచబోతున్నారా అన్న ప్రశ్నకు సమాధానిమిస్తూ "ప్రస్తుతం ఇటువంటి ప్రతిపాదన ఏదీ లేదు" అని ఆయన చెప్పారు . ఏటికేడాది రైల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఏప్రిల్-నవంబరు 2017 నాటికి ప్రయాణీకుల రవాణాలో 0.68 శాతం పెరుగుదలను, ఢిల్లీ, ముంబైల మధ్య 0.99 శాతం పెరుగుదలను నమోదు చేసినట్టు వెల్లడించారు. ప్రత్యేక కార్యక్రమాలకు, పండుగలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతుందన్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు నడుపుతున్న ఈ ప్రత్యేక రైలు సర్వీసుల్లో బేసిక్ ఛార్జీలపై వివిధ స్థాయిల్లో 10 నుంచి 30 శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా డిమాండ్‌కు అనుగుణంగా నడుపుతున్న సువిధ రైళ్లలోని ఛార్జీలు సైతం తత్కాల్ ఛార్జీల మాదిరిగానే ఉంటున్నాయని తెలిపారు. -
మెరుగైన సేవలందించండి
రైల్వే సహాయ మంత్రి గొహెయిన్ సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు మెరుగైన వసతులు అందించాలని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహెయిన్ పేర్కొన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. గురువారం ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. అనంతరం దక్షిణ మధ్య రైల్వే ద్వారా ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాలకు కొత్త రైల్‌కోచ్ ఫ్యాక్టరీ లేదు
న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా ఎలాంటి పనులు చేపట్టలేదని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్ వెల్లడించారు. బుధవారం లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతి నుంచి దేశ రాజధాని ఢిల్లీని కలుపుతూ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నడిపే ప్రతిపాదనేదీ ప్రస్తుతం లేదని రాజెన్ గొహైన్ తెలిపారు. రైల్వేజోన్‌పై కమిటీ సంప్రదింపులు జరుపుతోంది విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించి ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశామని, అయితే తుది నిర్ణయం తీసుకునేముందు ఈ కమిటీ ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉందని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్ తెలిపారు. బుధవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.