న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా ఎలాంటి పనులు చేపట్టలేదని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్ వెల్లడించారు. బుధవారం లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతి నుంచి దేశ రాజధాని ఢిల్లీని కలుపుతూ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నడిపే ప్రతిపాదనేదీ ప్రస్తుతం లేదని రాజెన్ గొహైన్ తెలిపారు.
రైల్వేజోన్‌పై కమిటీ సంప్రదింపులు జరుపుతోంది
విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించి ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశామని, అయితే తుది నిర్ణయం తీసుకునేముందు ఈ కమిటీ ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉందని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్ తెలిపారు. బుధవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాలకు కొత్త రైల్‌కోచ్ ఫ్యాక్టరీ లేదు
Published Thu, Jul 28 2016 3:00 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
Advertisement