రాణించిన మిథాలీ, సారిక | Railways beats hyderabad by 6runs in senior womens odi league | Sakshi
Sakshi News home page

రాణించిన మిథాలీ, సారిక

Dec 9 2017 10:30 AM | Updated on Sep 4 2018 5:32 PM

Railways beats hyderabad by 6runs in senior womens odi league - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. స్థానిక ఏఓసీ గ్రౌండ్‌లో రైల్వేస్‌ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన రైల్వేస్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 225 పరుగులు సాధించింది. సారిక కోలి (71; 8 ఫోర్లు),  కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (55; 6 ఫోర్లు) అర్ధసెంచరీలు చేయగా, మోనా మేశ్రమ్‌  (41; 3 ఫోర్లు) రాణించింది.

అనంతరం 226 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన హైదరాబాద్‌ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 220 పరుగులు చేసింది. ఓపెనర్లు స్నేహ మోరె (30; 4 ఫోర్లు), హిమాని యాదవ్‌ (54; 8 ఫోర్లు) తొలి వికెట్‌కు 60 పరుగుల్ని జోడించారు. ఇదే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. తర్వాత వెంటవెంటనే వికెట్లు పడటంతో హైదరాబాద్‌ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఎస్‌కే స్రవంతి నాయుడు (39; ఒక ఫోర్‌), ప్రణతి రెడ్డి (24; 4 ఫోర్లు) పరవాలేదనిపించారు. ప్రత్యర్థి బౌలర్లలో రాజేశ్వరి 4 వికెట్లతో హైదరాబాద్‌ను దెబ్బతీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement