గచ్చిబౌలి: హైదరాబాద్ నగరం క్రీడలకు ప్రధాన కేంద్రంగా మారుతోందని భారత మహిళల వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. ఆదివారం గచ్చిబౌలిలోని నిథిమ్‌లో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన నీలిమా పూదోట ‘ఫ్రమ్ ఎవరెస్ట్ విత్ లవ్’ పేరిట రాసిన పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... హైదరాబాద్ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంతర్జాతీయస్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించారని గుర్తు చేసింది.
క్రీడాకారుల ప్రతిభను మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోందని... రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని తెలిపింది. నీలిమ మాట్లాడుతూ తన తల్లి చిన్నప్పటి నుంచి సాహస క్రీడలను ప్రోత్సహించేదని తెలిపారు. తన తండ్రి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. తల్లి ప్రోత్సాహంతోనే ఎవరెస్ట్ ఎక్కానని అన్నారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడంలో తన అనుభవాలను పుస్తకంలో పొందుపర్చానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలిమా పూదోట, రచయిత శ్రీరామ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment