పచ్చమూకల విధ్వంసం.. గెలుపు మత్తులో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు | Tdp Leaders Attack On Vidadala Rajini Office | Sakshi
Sakshi News home page

పచ్చమూకల విధ్వంసం.. గెలుపు మత్తులో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు

Published Tue, Jun 4 2024 5:31 PM | Last Updated on Tue, Jun 4 2024 7:06 PM

Tdp Leaders Attack On Vidadala Rajini Office

సాక్షి, గుంటూరు: గెలుపు మత్తులో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పచ్చమూకల విధ్వంసం సృష్టించారు. గుంటూరు విద్యానగర్‌లోని విడదల రజని కార్యాలయంపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంపై రాళ్లు విసిరిన ఎల్లో గూండాలు కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ- జనసేన రౌడీమూకలు రాళ్లు విసురుతూ కార్యాలయ అద్దాలు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు.

వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. పర్నిచర్‌ను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. విజయవాడ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్శిటీ నేమ్‌ బోర్డును పచ్చమూక ధ్వంసం చేశారు.

పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బొల్లా బ్రహ్మనాయుడు కల్యాణ మండపంపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు.. కారును ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అచ్చంపేట మండలం కొండూరులో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులు బరితెగించి దాడులకు దిగారు. ఈ ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement