వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు | CM YS Jagan Review Of Medical And Health Department | Sakshi
Sakshi News home page

వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Published Mon, May 1 2023 1:21 PM | Last Updated on Mon, May 1 2023 5:32 PM

CM YS Jagan Review Of Medical And Health Department - Sakshi

సాక్షి, తాడేపల్లి : వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో  సీఎం జగన్‌ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెంటనే వాటికి సంబంధించిన ఖాళీలను భర్తీచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా సిబ్బంది లేరనే మాట రాకూడదని తెలిపారు.

సీఎం జగన్‌ మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిట్‌ చేయాలని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, మందులు కూడా సరిపడా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల దాదాపుగా సమస్యలు సమసిపోతాయని తెలిపారు. ​​​​​ప్రతి సమీక్షా సమావేశంలో కూడా సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానిపై వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. 

కోవిడ్‌ తాజా పరిస్థితులపై సీఎంకు వివరాలను అందించిన అధికారులు.
►రాష్ట్రంలో కోవిడ్‌ పూర్తిగా అదుపులో ఉందన్న అధికారులు.
►గత వారంరోజుల్లో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఏపీ 23 స్థానంలో ఉందన్న అధికారులు.
​​​​​​​►ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కేవలం 24 మంది మాత్రమేనని తెలిపిన అధికారులు.
​​​​​​​►వీరంతా కోలుకుంటున్నారని వెల్లడి.
​​​​​​​►సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే  నిర్వహించామని,  చాలా స్వల్ప సంఖ్యలో లక్షణాలు ఉన్నవారిని గుర్తించామన్న అధికారులు. 
​​​​​​​►లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామని వెల్లడి.

​​​​​​​►ప్రతి వైయస్సార్‌ క్లినిక్‌లో కూడా 20 ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను ఉంచామన్న అధికారులు.
​​​​​​​►14 ఆర్టీపీసీఆర్‌ ల్యాబులు పనిచేస్తున్నాయని వెల్లడి.
​​​​​​​►ఎయిర్‌పోర్టులలో విదేశాల నుంచి వచ్చేవారికి టెస్టులు చేస్తున్నామని తెలిపిన అధికారులు.
​​​​​​​►ఆక్సిజన్‌ యూనిట్లు, పైపులైన్లు, మాస్క్‌లు, మందులు, పీపీఈ కిట్లు ఇవన్నీ కూడా సరిపడా ఉన్నాయని వెల్లడి. 

​​​​​​​►ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాలి: సీఎం.
​​​​​​​►ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఏప్రిల్‌ 6 నుంచి 28 వరకూ 20,25,903 మందికి సేవలు. 
​​​​​​​►10,032 గ్రామాల్లో వైద్య సేవలు అందించిన ఫ్యామిలీ డాక్టర్‌.

​​​​​​​►ఫ్యామిలీ డాక్టర్‌ వచ్చేముందు ఎప్పుడు వస్తున్నారన్న దానిపై ముందుగానే తేదీలు ఇవ్వాలి. 
​​​​​​​►ఆ తేదీలను ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా గ్రామాల్లో ప్రజలకు తెలిపేలా చేయాలి.
​​​​​​​►దీనివల్ల వారు ఫ్యామిలీ డాక్టర్‌ వద్దకు వచ్చి వైద్యం పొందుతారు. 

​​​​​​​►అలాగే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయాలి.
​​​​​​​►ఎవరికి సమస్య ఉన్నా వారికి వెంటనే పరీక్షలు చేయించాలి. 
​​​​​​​►అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వాలి. 
​​​​​​​►సీహెచ్‌సీలలో వారికిచ్చిన వైద్య పరికరాలను వినియోగిస్తున్నారా ? లేదా ? అన్నది సమీక్ష చేయాలి.
​​​​​​​►అందుబాటులోని బోధనాసుపత్రుల్లో వారికి శిక్షణ ఇప్పించాలి.

కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు,  సీహెచ్‌సీలలో నాడు – నేడు పనులపై సీఎం సమీక్ష. 

​​​​​​​►కొత్త మెడికల్‌ కాలేజీల కారణంగా 2100 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయన్న అధికారులు.
​​​​​​​►రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2185 మెడికల్‌ సీట్లకు ఇవి అదనం అని తెలిపిన అధికారులు.
​​​​​​​►ఈ విద్యాసంవత్సంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నామన్న అధికారులు.
​​​​​​​►తద్వారా 750 సీట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపిన అధికారులు.
​​​​​​​►2024 –25 విద్యా సంవత్సరంలో మరో 350 ఎంబీబీఎస్‌ సీట్లు  అందుబాటులోకి రానున్నాయన్న అధికారులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement