కరోనాపై అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Review On On Health Department | Sakshi
Sakshi News home page

కరోనాపై అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి: సీఎం జగన్‌

Published Mon, Apr 10 2023 4:50 PM | Last Updated on Mon, Apr 10 2023 7:00 PM

CM YS Jagan Review On  On Health Department - Sakshi

తాడేపల్లి:  వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈరోజు(సోమవారం) విద్యాశాఖపై సమీక్ష అనంతరం వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్‌ ప్రధానంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి విడదల రజిని, సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో సీఎం జగన్‌ ఏమన్నారంటే..

  • కరోనా వ్యాపిస్తుందన్న సూచనలు నేపధ్యంలో అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశం
  • గ్రామ స్ధాయిలోనే పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
  • దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్నవారికి కోవిడ్‌ సోకితే వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించేలా చర్యలుండాలన్న సీఎం
  • కోవిడ్ తాజా పరిస్థితి, నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు
  • పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని తెలిపిన అధికారులు
  • పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు
  • విలేజ్‌ క్లినిక్స్‌ స్ధాయిలోనే ర్యాపిడ్‌ టెస్టులు చేసే వ్యవస్థ ఉందని, అక్కడ ఏమైనా తేలితే వెంటనే ఆర్టీపీసీఆర్‌కు పంపించే ఏర్పాటు చేశామన్న అధికారులు
  • రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ సర్వే చేయించామని కేవలం 25 మంది మాత్రమే కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరారని వెల్లడించిన అధికారులు
  • ఆక్సిజన్‌ లైన్లు, పీఎస్‌ఏ ప్లాంట్లు, ఆక్సిజన్‌ సిలెండర్లు, ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు వీటన్నింటినీ కూడా చెక్‌ చేసి  సిద్ధంచేసుకుంటున్నామన్న అధికారులు
  • అంతర్జాతీయ విమాన ప్రయాణికులనుంచి ర్యాపిడ్‌ శాంపిల్స్‌ తీసుకునేందుకు విమానాశ్రయాల్లో అన్నిరకాలుగా సిద్ధంచేశామన్న అధికారులు

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే...

  • ముందు జాగ్రత చర్యల్లో భాగంగా అన్నిరకాలుగా సిద్ధం కావాలన్న సీఎం.
  • ఎప్పటికప్పుడు పరిస్థితిని చూసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
  • ఫ్యామిలీ డాక్టర్, విలేజీ క్లినిక్స్‌ వ్యవస్ధ కోవిడ్‌ విస్తృతిని అడ్డుకోవడానికి, మంచి వైద్యం అందించేలా చేయడానికి ఉపయోగపడుతుందన్న సీఎం
  • గ్రామాల్లో సర్వే చేసి, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి, వారికి వెంటనే మందులు ఇచ్చేలా చూడాలన్న సీఎం
  • ప్రతి విలేజ్‌ క్లినిక్‌కూ టెస్టింగ్‌ కిట్స్, మందులు పంపించాలని సీఎం ఆదేశం
  • ప్రస్తుతం ఉన్న వేరియంట్‌కు తగినట్టుగా మందులు తెప్పించుకోవాలన్న సీఎం
  • ల్యాబులను అన్నింటినీ కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసుకోవాలన్న సీఎం

జిల్లాల్లో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులపైనా సీఎం జగన్ సమీక్ష

  • మొదటి ప్రాధాన్యతలో నిర్దేశించుకున్న విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల్లో షెడ్యూలు ప్రకారం పనులు జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు.
  • మిగిలిన కాలేజీల్లో కూడా పనులను ముందుకు తీసుకెళ్తున్నామన్న అధికారులు.
  • పూర్తయ్యే దశలో పలాస కిడ్నీ స్పెషాల్టీ హాస్పిటల్, కర్నూలులో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ కడపలో జీజీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ, కేన్సర్‌ విభాగంతో సహా మూడు బ్లాకులు. 
  • కొన్నిరోజుల్లో ఇవి పూర్తిగా సిద్ధమవుతాయని తెలిపిన అధికారులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement