![Creation of 353 posts in Cancer Monitoring - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/12/ISTOCKPHOTO-1214206519-612X.jpg.webp?itok=l_lBLjuN)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ రంగంలోనే మెరుగైన, నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో విశాఖలో కేజీహెచ్, గుంటూరు జీజీహెచ్, కడప జీజీహెచ్‌లలో క్యాన్సర్ సెంటర్‌లతో పాటు, డీఎంఈ కార్యాలయంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కోసం ప్రభుత్వం 353 పోస్టులను కొత్తగా సృష్టించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల డి.హోస్మని ఉత్తర్వులిచ్చారు.
6 ప్రొఫెసర్, 5 అసోసియేట్, 14 అసిస్టెంట్ ప్రొఫెసర్, 90 స్టాఫ్ నర్స్, 90 జనరల్ డ్యూటీ అటెండెంట్ చొప్పున, మిగిలిన వాటిలో ఇతర పోస్టులను కేటాయించారు. 50 కి.మీ దూరంలో క్యాన్సర్ వైద్యసేవలనుఅందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. లెవల్–1 క్యాన్సర్ సెంటర్‌గా గుంటూరును, లెవల్–2 సెంటర్‌లుగా కర్నూలు, విశాఖ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment