వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని ఉద్యోగాలు | More Jobs in Medical Health Sector By Andhra Pradesh Govt | Sakshi
Sakshi News home page

వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని ఉద్యోగాలు

Published Wed, Feb 28 2024 4:42 AM | Last Updated on Wed, Feb 28 2024 4:42 AM

More Jobs in Medical Health Sector By Andhra Pradesh Govt - Sakshi

సెకండరీ హెల్త్‌లో 185 స్పెషలిస్ట్‌ వైద్య పోస్టుల భర్తీకి చర్యలు

బుధ, శుక్రవారాల్లో వాకిన్‌ రిక్రూట్‌మెంట్‌

అర్బన్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో 189 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

నేటి నుంచి మార్చి 10వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ (ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదు) విధానాన్ని తీసుకు­వచ్చి పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేపడుతోంది. వైద్య విద్యా కోర్సులు పూర్తి చేసిన నిరుద్యో­గులకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. దీనిలో భా­గంగా సెకండరీ హెల్త్‌ డైరెక్టరేట్‌­(ఏపీవీవీపీ) పరిధిలో 185 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ (సీఏఎస్‌ఎస్‌) పోస్టుల భర్తీకి బుధ, శుక్రవారాల్లో ఏపీ మెడికల్‌ సర్వీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ వాకిన్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించనుంది. జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, డెర్మటా­లజీ, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ.. 

ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగాల్లో పోస్టులను బుధవారం భర్తీ చేయనున్నారు. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్తీషియా, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, పాథాలజీ విభాగాల్లో పోస్టుల భర్తీకి శుక్రవారం వాకిన్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు షెడ్యూల్‌ ప్రకారం తాడేపల్లిలోని సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించే వాకిన్‌ రిక్రూట్‌మెంట్‌కు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య హాజరవ్వాల్సి ఉంటుంది. శాశ్వత, కాంట్రాక్ట్, కొటేషన్‌ విధానాల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.

మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచేయడానికి స్పెషలిస్ట్‌ వైద్యులు ముందుకు రాకపోతుండటంతో కొటేషన్‌ విధానాన్ని సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో మారుమూల ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచేయడానికి ఎంత వేతనం కావాలో వైద్యులు కొట్‌ చేయవచ్చు. ఆ కొటేషన్‌లను పరిశీలించి వైద్యులు కోరినంత వేతనాలను ఇచ్చి మరీ ప్రభుత్వం వైద్యులను నియమిస్తోంది. పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం http://apmsrb.ap.gov.in/­m­srb/, https://hmfw.ap.gov.in  వెబ్‌సైట్‌లను అభ్యర్థులు పరిశీలించాల్సి ఉంటుంది.  

మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీ..
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని అర్బన్‌ హెల్త్, వెల్‌నెస్‌ సెంటర్లలో 189 పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ మంగళవారం నోటిఫికేసన్‌ జారీ చేసింది. కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు బోర్డ్‌ మెంబర్‌ సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. భర్తీ చేసే పోస్టుల్లో 102 మెడికల్‌ ఆఫీసర్లు, 87 స్టాఫ్‌ నర్సు పోస్టులు ఉన్నాయన్నారు.  బుధవారం నుంచి మార్చి 10వ తేదీ వరకూ అర్హులైన అభ్యర్థులు https://apmsrb.ap.gov.­in/­msrb వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక సమగ్ర నోటిఫికేషన్‌ను  https://apmsrb.ap.gov.in/msrb, https://dme.­ap.nic.in వెబ్‌సైట్‌లను అభ్యర్థులు సంప్రదించాల్సి ఉంటుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement