అహ్మదాబాద్: 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో గుజరాత్‌లో బీజేపీ కేంద్ర కార్యనిర్వహణ వర్గాల్లో మార్పులు చేర్పులు చేస‍్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రస్తుతం ఉన్న నాయకుల బలబలాలను అంచనా వేసి, ఉంచాలా? దించాలా? నిర్ణయం తీసుకుంటోంది. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ పరిణామాల అనంతరం..గుజరాత్ బీజేపీ జనరల్ సెక్రెటరీ ప్రదీప్ సిన్హా వాఘేలా తన పదవికి రాజీనామా చేశారు.
రాజీనామా అనంతరం మాట్లాడిన ప్రదీప్ సిన్హా.. మరికొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుందని అన్నారు. అయితే.. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షునిగా పనిచేస్తున్న సీఆర్ పాటిల్ పదవికే ప్రదీప్ సిన్హ గురిపెట్టాడనే ఆరోపణలు వచ్చిన తర్వాత తాజాగా ఈ పరిణామాలు జరిగాయి. తాజాగా తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపిన ప్రదీప్ .. ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
రాష్ట్ర బీజేపీ పార్టీకి జనరల్ సెక్రటరీగా ప్రదీప్ సిన్హ వాఘేలా 2016 ఆగష్టు 10న బాధ్యతలు చేపట్టారు. భారతీయ జనతా యువ మోర్చాకు ఆయన అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికల సమరం దగ్గరపడుతున్న నేపథ్యంలోనే వాఘేలా తన పదవికి రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలాడుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ 'మహా జన్ సంపర్క్ అభియాన్' అనే కార్యక్రమాన్ని కూడా ఇటీవల చెప్పటింది. ఈ సమావేశానికి రాష్ట్రంలో ప్రముఖులు, మేధావులు, వ్యాపార వేత్తలు హాజరయ్యారు. రాష్ట్రంలో దాదాపు 26 లోక్ సభ స్థానాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ర్యాలీలను నిర్వహించింది. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యనిర్వహణ వర్గాల్లో భారీ మార్పులే చేసింది.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్.. బీహార్ నుండి స్పెషల్ మటన్ తెప్పించి..
Comments
Please login to add a commentAdd a comment