Varun Dhawan Driver Death: Emotional Post After His Driver Death Due To Heart Attack - Sakshi
Sakshi News home page

Varun Dhawan: ఆ హీరో ఇంట్లో విషాదం.. అతనే సర్వస్వం అంటూ ఎమోషనల్‌

Published Wed, Jan 19 2022 2:45 PM | Last Updated on Wed, Jan 19 2022 3:05 PM

Varun Dhawan Pens Emotional Note After His Driver Death By Heart Attack - Sakshi

Varun Dhawan Pens Emotional Note After His Driver Death By Heart Attack: బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ఇంట్లో విషాదం నెలకొంది. వరుణ్‌ ధావన్‌ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్‌ అకస్మాత్తుగా మృతిచెందాడు. బాంద్రాలోని మెహబూబ్‌ స్డూడియోలో సినిమా షూటింగ్‌ చేస్తున్నప్పుడు వరుణ్‌ డ్రైవర్‌ మనోజ్ సాహు గుండెపోటుతో బాధపడ్డాడు. దీంతో అతన్ని వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని మరణం విని వరుణ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఆసుపత్రి బయట చాలాసేపు తచ్చాడాడు. అనంతరం వరుణ్ తన కారులో ఆసుపత్రి నుంచి బయలుదేరాడు. వరుణ్‌ ధావన్‌ దగ్గర చాలా ఏళ్లుగా మనోజ్ సాహు ఎంతో నమ్మకస్థుడిగా ఉన్నాడు. అతనంటే వరుణ్‌కు అమితమైన ప్రేమ. మనోజ్‌ దాదా  అంటూ ముద్దుగా పిలిచేవాడు. 

మనోజ్‌ సాహుపై తనకున్న ప్రేమను ఇన్‌స్టా గ్రామ్‌ వేదికగా వరుణ్‌ పంచుకున్నాడు. అతని గొప్పదనం గురించి ఎమోషనల్‌గా పోస్ట్‌ చేశాడు. '26 ఏళ్లుగా మనోజ్‌ నాతో ఉన్నాడు. అతనే నాకు సర్వస్వం. నా బాధను తెలిపేందుకు నా దగ్గర పదాలు లేవు. కానీ నాకు కావాల్సింది అతని అద్భుతమైన తెలివి, హాస్య చతురత, జీవితం పట్ల అతనికున్న అభిరుచిని ప్రజలు గుర్తుంచుకోవడమే. నువ్‌ నా జీవితంలో నాతో ఉన్నందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను మనోజ్‌ దాదా.' అని భావోద్వేగంగా రాసుకొచ్చాడు.

(చదవండి: విడాకులు తీసుకున్న మరో నటుడు.. మరణమే బాగుంటుందని)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement